NRIs

North West Indiana ఉగాది వేడుకలు 2024

May 24, 2024 12:12 AM

North West Indiana  ఉగాది వేడుకలు 2024

ఏప్రిల్ 20న, సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు, NWI లోని తెలుగు సమాజం శ్రీ క్రోధి నామ ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకుంది. మెర్ల్‌విల్‌ నగరంలోని IACC, ఈ సంబరాలకు వేదికగా నిలిచింది.

స్థానిక తెలుగు ప్రజలు మరియు ఇతర కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ మోహన్ కేసాని గారి స్వాగత ఉపన్యాసం తో కార్యక్రమం ప్రారంభమైంది. పిల్లలు మరియు పెద్దలు పలు సాంస్కృతిక ప్రదర్సనాలతో సభికులను అలరించారు.

షడ్రసోపేతమైన తెలుగు భోజనం వేడుకలకు మరింత శోభను తెచ్చింది. డాక్టర్ వెంకట్ వావిలాల ఈ కార్యక్రమం నిర్వహణలో సహాయపడిన వారందరికీ  ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికాలో తమ సంస్కృతిని గౌరవిస్తూ, కళలను పరిరక్షిస్తూ, ఇలాంటి వేడుకలను ఆదరించడం ద్వారా తెలుగు వారు వారి భావి తరాలకు స్ఫూర్తిని ఇస్తున్నారు.

Have something to say? Post your comment